కడప: వైఎస్సార్ జిల్లాలో గంజాయి అమ్మకాలతో పాటు, దొంగనోట్ల చలామణి చేస్తోన్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. కడప నగరంలో సిద్ధప్రియ లాడ్జిలో దొంగనోట్లు ముద్రణ చేస్తున్నట్లు సమాచారం అందడంతో.. దాడులు నిర్వహించి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల్లో ఇద్దరు కామెరూన్ దేశానికి చెందినవారని, మరో ఇద్దరు విశాఖ, ఒకరు కడపకు చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.7.28 లక్షల దొంగనోట్లు, తొమ్మిది కేజీల గంజాయి, ముద్రణ ప్రింటర్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
కడపలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు