ఢిల్లీ అల్లర్లు : 34కు చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 27 నుంచి 34కు చేరింది. ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం నాటికి ప్రశాంతత నెలకొంది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన చాంద్‌ భాగ్‌, భజన్‌పుర, కజురీ ఖాస్‌లలో గురువారం పారిశుద్ధ కార్యక్రమాలు మొదలయ్యాయి. ( నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ )